telangana
పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: బొంపల్లి 10 వార్డు సభ్యులు కొనగాళ్ల నర్సిములు పిలుపు
దోమ, మేజర్ న్యూస్: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని బొంపల్లి పదో వార్డు సభ్యుడు కొనగాళ్ల నర్సిములు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన విలువైన ఆయుధమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఓటరు నమోదుకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని, అర్హులైన పట్టభద్రుల నమోదు కోసం సహకారం అందిస్తామని కొనగాళ్ల నర్సిములు తెలిపారు.