*పాము కాటుతో మరణించిన కల్లుగీత కార్మికుడు మార్క రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి*
కోహేడ మండల కేంద్రానికి చెందిన కల్లుగీత కార్మికుడు మార్క రాజమౌళి గౌడ్ గత ఆరు రోజుల క్రితం పాము కాటుతో మరణించగా నేడు కొహెడలోని వారి నివాసంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి గారు వారి కుటుంబసభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడవద్దు అండగా ఉంటామని, పిల్లల చదువుకు చేయూతనందిస్తామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. వారితో పాటు బిఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి బబ్బురు శ్రీనివాస్ గౌడ్, మునిగంటి శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.