BREAKING
అభివృద్ధిని చూడండి -- కూటమి అభ్యర్థులను గెలిపించండి -- జడ్పిటిసి కుంజ నాగమణి, ఎంపీటీసీ బుద్ధ రజిని ని గెలిపించండి -- ప్రచారం నిర్వహించిన టిడిపి నియోజకవర్గ నాయకురాలు పూనెం శశికళ. చిత్తూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 51.2 శాతం ఓటింగ్ నమోదు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పొట్టి శ్రీరాములు త్యాగం అవనిగడ్డలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆపదలో అండగా బీజేపీ నాయకులు పలమనేరు మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ మంజుప్రియ వెంకటేష్ ఎన్నికల ప్రచారం రికార్డు స్థాయిలో శ్రీ చైతన్య స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్‌కు 15,615 మంది విద్యార్థుల హాజరు ఢిల్లీలో జరిగిన ఓటు బచావో దేశ్ బచావో ర్యాలీలో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్* *ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది: ఎంపీ దగ్గుమళ్ళ* ఎంపీడీఓల సమస్యల పరిష్కారానికి టీఎంపీడీఓల సమరశంఖం! మహిళ పర్సు వెతికిపట్టిన సీసీసీ నస్పూర్ పోలీసులు నీరు చేరక ఇబ్బంది పడుతున్న రైతులు ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ TSUTF మహాసభల్లో ఆకట్టుకున్న దుగినేవెళ్లి విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన

నెల రోజుల్లోనే 20,451 మంది విద్యార్థులకు అల్పాహారం.. త్వరలో 29,183 మందికి విస్తరించనున్న సేవలు!

Select Suryaa Now
నెల రోజుల్లోనే 20,451 మంది విద్యార్థులకు అల్పాహారం.. త్వరలో 29,183 మందికి విస్తరించనున్న సేవలు!

మెదక్, ; ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహార పథకం మెదక్ జిల్లాలో సత్ఫలితాలను అందిస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 20,451 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తూ హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా తన సేవలను విజయవంతంగా కొనసాగిస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 11 మండలాలకు విస్తరించి మొత్తం 29,183 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్ 26న ప్రారంభమైన కమ్యూనిటీ కిచెన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అల్పాహార కార్యక్రమంలో భాగంగా మెదక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రీకృత సామూహిక వంటశాలను సెప్టెంబర్ 26, 2026న రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ఐదు మండలాల్లో 20,451 మంది విద్యార్థులకు సేవలు

ప్రస్తుతం మెదక్, హవేలీ ఘన్‌పూర్, ఎల్దుర్తి, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లోని 238 ప్రభుత్వ పాఠశాలలు, 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 20,451 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తున్నారు.త్వరలోనే ఈ సేవలను జిల్లాలోని మొత్తం 11 మండలాలకు విస్తరించనున్నారు. ఇందులో భాగంగా 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిధిలోని 29,183 మంది విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు.

విద్యార్థుల హాజరులో గణనీయమైన మార్పు

ఈ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు మెరుగుపడుతోందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. అల్పాహారం అందుబాటులో ఉండటంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరవుతున్నారని, గైర్హాజరు, బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు.ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. ఆహార నాణ్యత, సరఫరా తీరుపై తల్లిదండ్రుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు.

పోషకాహారంతో కూడిన ఆరు రకాల అల్పాహారం

విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సహకారంతో అల్పాహార మెనూను రూపొందించారు.

వారానికి ఆరు రోజుల పాటు వివిధ రకాల అల్పాహారాన్ని అందిస్తున్నారు.

  1. మొదటి రోజు – ఇడ్లీ, సాంబార్
  2. రెండో రోజు – పూరి, ఆలూ కుర్మా
  3. మూడో రోజు – దోశ, చట్నీ
  4. నాలుగో రోజు – ఉప్మా, చట్నీ
  5. ఐదో రోజు – చిరుధాన్యాల ఇడ్లీ, సాంబార్
  6. ఆరో రోజు – బోండా, చట్నీ

వీటితో పాటు రోజు విడిచి రోజు విద్యార్థులకు వేడి పాలను కూడా అందిస్తున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక దృష్టి

విద్యార్థులు ఉదయం ఆకలితో పాఠశాలలకు రాకుండా చూడటంతో పాటు, పోషకాహారంతో వారి ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రత, పాఠశాల హాజరును మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం మధిర, మంథని, మంచిర్యాల, కరీంనగర్, మెదక్ తదితర ప్రాంతాలకు విస్తరించిందని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.