BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

చిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్* *ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది: ఎంపీ దగ్గుమళ్ళ*

Select Suryaa Now
చిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్*  *ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది: ఎంపీ దగ్గుమళ్ళ*

చిత్తూరు అర్బన్ మేజర్ న్యూస్:చిత్తూరు నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తో కలిసి నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా వారు పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు కల్పించిన వసతులను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లతో ఎంపీ ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు మాట్లాడుతూ:
"ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిది ఓటు హక్కు. నగర భవిష్యత్తును, అభివృద్ధిని నిర్ణయించే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలి" అని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు, కూటమి ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్