49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు
49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు
*ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇచ్చి తీసుకొచ్చినట్లు మహిళల వెల్లడి
*48, 49 వార్డుల్లో రిగ్గింగ్ ప్రయత్నాలను అడ్డుకొన్న – సీపీయం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ వార్డు సుందరయ్య నగర్ ప్రాంతంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్న మహిళలను సీపీఎం ఎన్నికల ఏజెంట్లు గుర్తించారు,
మంగళం ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుండగా సీపీఎం జనరల్ ఏజెంట్ నరేంద్ర, ఇతర ఏజెంట్లు వారిని ప్రశ్నించారని తెలిపారు. వారి వివరాలు అడగగా సరైన సమాధానాలు చెప్పలేకపోయారని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున డబ్బులు ఇచ్చి మంగళం నుంచి ఓట్లు వేయించేందుకు తీసుకొచ్చారని సదరు మహిళలు వెల్లడించినట్లు వేణుగోపాల్ ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
48, 49 వార్డుల్లో అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లు వేయించి, రిగ్గింగ్‌కు పాల్పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, సీపీఎం కార్యకర్తలు వాటిని అడ్డుకుంటున్నారని
Raaju బ్యూరో,తిరుపతి జిల్లా,