BREAKING
విరాట్ కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు నెట్స్‌లో ఊహించని పరిణామం హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్ ఘన విజయం: బంగ్లాదేశ్‌పై చెలరేగిన శశాంక్ సింగ్, కృనాల్ పాండ్యా రూ.80కే 25 గ్రాముల ప్రోటీన్.. అమూల్ కొత్త హై ప్రోటీన్ క్యూబ్స్ జనసేన లో చేరిన ఆనంగి గంటయ్యా ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడం ఎలా: ఆరోగ్యకరమైన జీవనానికి సింపుల్ చిట్కాలు చీరాల, రేపల్లె లలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత వైసీపీ అభ్యర్థుల గెలుపునకు బడే గౌతమ్ విస్తృత ప్రచారం నెరవేరని హామీలు.. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఓటేయండి ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాలీవుడ్‌లో రానా దగ్గుబాటి సంచలన ప్రాజెక్ట్: కంగనా రనౌత్‌తో హారర్ సినిమా తెరకెక్కించనున్న రవిబాబు పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

పొన్నూరులో పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
పొన్నూరులో పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో   ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

 పొన్నూరు మేజర్ న్యూస్:-ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పొన్నూరు పట్టణ పొట్టి శ్రీరాముల పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బాపనపల్లి లక్ష్మీ ప్రభాకర్ ప్రసాదరావు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి తాటికొండ వెంకట శివరామకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర పిత అని కొనియాడారు. ఆయన త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు అనంతరం పొన్నూరు గాంధీ బొమ్మ సెంటర్ నందు పొట్టి శ్రీరాములు విగ్రహం మరియు గాంధీ  విగ్రహాలను ఏర్పాటు చేయాలని సమితి సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కారుమూరి ప్రకాష్, పొన్నూరు పట్టణ అధ్యక్షులు తాటికొండ ఉమామహేశ్వరరావు, కోశాధికారి కర్నాటి వెంకటేశ్వర్లు, పొన్నూరు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు సాధు కిషోర్, కార్యదర్శి కర్నాటి కృష్ణ ప్రసాద్, బొద్దులూరి రంగారావు, మద్దాలి నాగేశ్వరరావు, వాసవి క్లబ్ పొన్నూరు అధ్యక్షులు పోలిశెట్టి విజయకుమార్, కార్యదర్శి వేలంపల్లి ప్రవీణ్, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్టి రామకృష్ణ రావు, అవ్వారు ఆదిమ సత్రం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అవ్వారు వెంకటేశ్వర్లు, కొమ్మూరి భీమేశ్వరరావు, వేలంపల్లి జనార్దన్ రావు, భవిరిశెట్టి వెంకటేశ్వర్లు, ఆత్మకూరి నాగమల్లేశ్వరరావు, ఆత్మకూరు రూపేష్, గుంటూరు రవికుమార్ మరియు పలువురు పొన్నూరు పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్