సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..
యద్దనపూడి, మేజర్‌న్యూస్ :
నవంబర్ 5న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం యద్దనపూడి మండలం సురవరపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యద్దనపూడి మండల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డక్కుమల్లి పల్లవితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎన్నికల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు గుదే తారక రామారావు, కోయ సతీష్, మురళి, వంశీ, షేక్ శ్రీను, పెడవల్లి వెంకటరావు, సునీల్, బోయపాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.