TSUTF మహాసభల్లో ఆకట్టుకున్న దుగినేవెళ్లి విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించిన TSUTF జిల్లా ఏడవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కట్టంగూరు మండలం దుగినేవెళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.
విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ అద్భుతంగా నృత్య ప్రదర్శన నిర్వహించడంతో వారిని అభినందించారు. అనంతరం నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వెంకట రమణ, మురళయ్య,కరుణాదేవి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రావు, సరిత, సలీం, రాంకోటి, ఐతగోని సైదులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు అందజేయడం పట్ల ఉపాధ్యాయులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.