నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ సభ్యుడు హకీమ్ విశ్వప్రసాద్‌కు ప్రతిష్టాత్మక మల్టిపుల్ అవార్డు*
నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ సభ్యుడు హకీమ్ విశ్వప్రసాద్ కు ప్రతిష్టాత్మక మల్టిపుల్ అవార్డు ను లైన్స్ క్లబ్ మల్టిపుల్ చైర్మన్ రాజేంద్రప్రసాద్, అమర్నాథ్ రావు చేతుల మీదుగా మల్టిపుల్ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ శామీర్ పెట్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో జరిగిన మల్టిపుల్ అవార్డ్స్ నైట్ లో గత మల్టిపుల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్,మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి,ప్రస్తుత మల్టిపుల్ చైర్మన్ అమర నాథ రావు,ప్రస్తుత గవర్నర్ సురేష్ జగ్నని ప్రత్యేకంగా నిర్వహించిన లైన్స్ క్లబ్ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ హకీమ్ విశ్వప్రసాద్ స్వీకరించారు.గత సంవత్సరం డిస్ట్రిక్ట్ మెంబర్ షిప్ కోఆర్డినేటర్ గా పనిచేసిన కాలంలో కొత్తగా లయన్స్ క్లబ్స్ స్థాపించడం,పాత క్లబ్బులలో నూతన సభ్యులను చేర్పించడంలో చేసిన సేవలు,కృషికి గాను ఈ అవార్డు లభించిందనీ అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ గవర్నర్ లు రాధాకృష్ణ, చెన్న కిషన్ రెడ్డి, హరినారాయణ్ బట్టడ్ లు పాల్గొన్నారు. అవార్డు పొందిన విశ్వ ప్రసాద్ ను అభినందించారు. వారితో పాటు నాగర్ కర్నూల్ క్లబ్ సభ్యులు కూడా అభినందనలు తెలియచేసారు.అవార్డు అందుకున్న హకిమ్ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా సామాజిక ,లైన్స్ క్లబ్ లలో చేసిన సేవలకు గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ రాధాకృష్ణ, చెన్నకేశవరెడ్డి,హరి నారాయణ బట్వాడ్,రాష్ట్రంలోని వివిధ క్లబ్ ల సభ్యులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్ , సూర్యన్యూస్