BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

ఎంపీడీఓల సమస్యల పరిష్కారానికి టీఎంపీడీఓల సమరశంఖం!

Select Suryaa Now
ఎంపీడీఓల సమస్యల పరిష్కారానికి టీఎంపీడీఓల సమరశంఖం!

ఎంపీడీఓల సమస్యల పరిష్కారానికి పోరాటం..  డీఎల్‌డీఓ పోస్టు ఏర్పాటు చేయాలి.. ఎంపీడీఓలకు రెగ్యులర్ వాహన సదుపాయం కల్పించాలి.. రంగారెడ్డి జిల్లా కేంద్రంగా టీఎంపీడీఓల సెంట్రల్ కమిటీ కీలక తీర్మానాలు

(రంగారెడ్డి - మేజర్ న్యూస్): తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం (TMPDOs) సెంట్రల్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణలోని 33 జిల్లాల బాధ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

సమావేశంలో ఆమోదించిన ప్రధాన తీర్మానాలు ఇవే..

పంచాయతీరాజ్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్‌కు మద్దతు : నూతనంగా ఏర్పాటైన పంచాయతీరాజ్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్‌లో ఎంపీడీఓలు కీలక భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించారు. ఎంపీడీఓల సమస్యల పరిష్కారానికి సర్వీస్ అసోసియేషన్‌తో కలిసి పనిచేయాలని తీర్మానించారు.

డీఎల్‌డీఓ పోస్టు ఏర్పాటు చేయాలి : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు డివిజనల్ లెవెల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DLDO) పోస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించి, ఆ డిమాండ్ సాధన కోసం పోరాడాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఎంపీడీఓలకు వాహన సదుపాయం : విధుల నిర్వహణలో భాగంగా ఎంపీడీఓలకు రెగ్యులర్‌గా వాహన సదుపాయం కల్పించాలని, ఇందుకు సంబంధించిన నిధులను ప్రతి నెలా ట్రెజరీ ద్వారా విడుదల చేయాలని తీర్మానించారు.

అడాక్ ఎంపీడీఓలకు రెగ్యులర్ ఉత్తర్వులు : ప్రస్తుతం అడాక్ పద్ధతిలో ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు రెగ్యులర్ ఎంపీడీఓలుగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు.

కార్యాలయ నిర్వహణకు నిధులు : ప్రజావాణి కార్యక్రమం నిర్వహణతో పాటు మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రతి నెలా విడుదల చేయాలని నిర్ణయించారు.

గ్రూప్-1 పే స్కేల్ అమలు చేయాలి : గ్రూప్-1లో పనిచేస్తున్న ఎంపీడీఓలకు ఇతర గ్రూప్-1 శాఖల అధికారులకు వర్తించే విధంగానే పే స్కేల్‌ను అమలు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ డిమాండ్ల సాధనకు ప్రభుత్వానికి నివేదించడంతో పాటు, ఎంపీడీఓల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో టీఎంపీడీఓల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షురాలు జె. పద్మావతి, ప్రధాన కార్యదర్శి ఎం. మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు గంగుల సంతోష్ కుమార్, కోశాధికారి కె. మహేష్ బాబు, రాష్ట్ర బాధ్యులు దివ్యదర్శన్ రావు, యాకుబ్, యాదగిరి, ఉజ్వల్ కుమార్, వెంకటేశ్వర్ రావు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.