BREAKING
చలో ఢిల్లీ బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. మురసు’గా నామకరణం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించెకొన్న తలారి రంగయ్య. మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు దర్శకుడిగా హరీశ్ శంకర్: మెగావర్స్ ప్రోమో షూట్ వివరాలు వైరల్ మురాసు తుపాను బలపడుతోంది.. ఏపీకి భారీ ముప్పు! తెలంగాణలోనూ వర్షాలు, ఈదురుగాలులు సబా ఆజాద్‌కు హృతిక్ రోషన్ రొమాంటిక్ బర్త్‌డే విషెస్.. “జీవితాంతం లాంగ్ లేఓవర్లు కలిసి గడుపుదాం” కజకిస్థాన్‌ షెడ్యూల్‌లో చేరిన వెంకటేశ్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి తుది దశ షూటింగ్‌లో విక్టరీ హీరో వీరన్నపాలెం గ్రామంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్, పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 11వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న మార్కెట్ నాగేష్, చికెన్ తిరుపాల్ శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం: పులివెందుల ఘటనలపై మంత్రి లోకేష్ ఆగ్రహం! ఏఐ విజువల్స్‌పై ట్రోల్స్: నయనతార 'మహాశక్తి' సినిమాపై స్పందించిన డైరెక్టర్ ఓటీటీలోకి సంచలన మలయాళ క్రైమ్ థ్రిల్లర్: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న 'ది థర్డ్ మర్డర్' చిన్నగంజాం నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు •కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక : కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి ఐదు వేల ఏళ్ల కిందటే మన దేశంలో ఫ్లయింగ్ కార్లు ఉన్నాయి: ఎలన్ మస్క్ టెన్లా ఇన్నోవేషన్‌తో పుష్పక విమానాన్ని పోల్చిన రణ్‌బీర్ కపూర్ విద్యుత్ ప్రమాదంలో గొర్రె మృతి

అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రారంభం

 

అవనిగడ్డ,  మేజర్ న్యూస్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ అవనిగడ్డ డిపోలో బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉద్యోగులకు యోగా తరగతులు నిర్వహించారు.

యోగా గురువు మానేపల్లి వేణుగోపాల్‌ ఉద్యోగులతో యోగాసనాలు వేయించి, నిత్యం యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

డిపో మేనేజర్‌ కె. హనుమంతరావు మాట్లాడుతూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు యోగా, వ్యాయామం అలవాటు చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు.

వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 2న ఇంధన పొదుపు, 3న నీటి పొదుపు, ఆహార వినియోగ విధానం, 4న ఆహార పరిరక్షణ, 5న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిర్మూలన, 6న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నిర్వహణ, 7న ఇతర వ్యర్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అనంతరం బస్‌స్టేషన్‌ ఆవరణలో సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు సీహెచ్‌. శ్రీలక్ష్మి (ట్రాఫిక్‌), ఎం. దివ్య (మెకానికల్‌), ఆఫీస్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ పి. శ్రీధర్‌, వివిధ యూనియన్ల నాయకులు, సుమారు 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.