అభివృద్ధి చేసి చూపడమే నా లక్ష్యం.. ప్రజల ఆశీస్సులతోనే ప్రజాసేవలోకి!
ఓటర్ల ముందుకు వస్తున్న తీరివీధి రమేష్ శెట్టి
అధికార పార్టీ అండదండలతో వెల్దుర్తిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ధీమా
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్.వెల్దుర్తి పట్టణ ప్రజల అండదండలతోనే తాను సంపూర్ణంగా ప్రజాసేవలోకి అడుగుపెడుతున్నానని, ప్రజలందరూ తనను ఆదరించి ఆశీర్వదించాలని తీరివీధి రమేష్ శెట్టి కోరారు. వెల్దుర్తి పట్టణంలోని 16 వార్డులలో పేరుకుపోయిన సమస్యలను పూర్తిగా పరిష్కరించి, రాబోయే రోజుల్లో వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీని అన్ని విధాలా అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తన ప్రధాన ధ్యేయమని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి అభివృద్ధి పినీ చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అధికార పార్టీ అండదండలు తనకు సంపూర్ణ మద్దతుగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రత్యేక నిధులను మరింత వేగంగా గ్రామానికి తీసుకువచ్చి, మన ప్రాంత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో తీరివీధి డాక్టర్ రాంప్రసాద్, తీరివీధి సుధీంద్ర, అత్తులూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం