BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

మహిళ పర్సు వెతికిపట్టిన సీసీసీ నస్పూర్ పోలీసులు

Select Suryaa Now
మహిళ పర్సు వెతికిపట్టిన సీసీసీ నస్పూర్ పోలీసులు

సూర్య, నస్పూర్‌ :  ఆటోలో మరిచిపోయిన మహిళ పర్సును సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించి సీసీసీ నస్పూర్ పోలీసులు బాధితురాలికి అప్పగించారు. పర్సులో ఉన్న 20 గ్రాముల బంగారు నక్లెస్, కీ ప్యాడ్ ఫోన్‌ను తిరిగి అందజేశారు. నస్పూర్ పట్టణం మల్లికార్జున నగర్‌కు చెందిన బలసంకుల మంగ (55) అక్టోబర్ 29న మంచిర్యాల గౌతమి నగర్‌లోని కోదండ రామాలయానికి వెళ్లి రాత్రి 8.30 గంటలకు ఆటోలో నస్పూర్ గేటు వద్ద దిగారు. ఈ సమయంలో పర్సును ఆటో వెనుక సీటులో మరిచిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయం గుర్తించి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీసీ నస్పూర్ ఎస్సై తహసీనుద్దీన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ  టి జితేందర్ సింగ్,  సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాధితురాలు ప్రయాణించిన ఆటోను గుర్తించారు. అందులోని పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాధితురాలికి పర్సుతో పాటు బంగారు నక్లెస్, మొబైల్ ఫోన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని  నస్పూర్ సీఐ గోపతి రవీందర్ అభినందించారు.