ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం చిత్తూరు నగర పాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా 11వ డివిజన్ పరిధి లోని బాపు బాల భవన్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఆయన సతీమణి కంచెర్ల ప్రతిమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టారని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా, చిత్తూరులో ప్రజలు కూటమి ప్రభుత్వ వైపే ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ మంచి పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. చిత్తూరు ప్రజల ఆశీస్సులతో చిత్తూరు కూటమి మేయర్ అభ్యర్థి కఠారి హేమలత మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.