BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

గణపురం,  మేజర్ న్యూస్, గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ కొడారి హైమావతి–ధనుంజయ్‌ యాదవ్‌ పర్యవేక్షణలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పారు. పండుగ ప్రాంగణాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతో వేడుకలకు మరింత శోభ చేకూరింది. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

రిపోర్టర్ ;ఎల్లయ్య, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా