BREAKING
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఏఈఈ సివిల్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ ‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు.. ఎల్‌నినో ప్రభావంపై పందనపల్లిలో అవగాహన సదస్సు తుఫాన్ ప్రభావంతో వత్సవాయిలో కొనసాగుతున్న వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన.. నిర్మానుష్యంగా మారిన రహదారులు సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం

ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!

Select Suryaa Now
ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!

9వ వార్డులో బోరుబావి ఏర్పాటు.. వేసవి అవసరాలపై మున్సిపాలిటీ దృష్టి

చౌటుప్పల్‌: ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డులో కాలనీవాసుల తాగునీటి అవసరాల కోసం బోరుబావిని ఏర్పాటు చేయించారు. బొబ్బల రాజశేఖర్‌రెడ్డి ఈ ఏర్పాటుకు సహకరించారు.

వేసవిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా బోరుబావి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మోటారు, విద్యుత్‌ పరికరాలను పరిశీలించి నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలు తలెత్తకముందే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో తాగునీటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.