BREAKING
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం.. బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

మ్మెల్సీ ఎన్నికల్లో సహకరించండిఃచ మధుయాష్కి గౌడ్‌ను ఆహ్వానించిన కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి

Select Suryaa Now
మ్మెల్సీ ఎన్నికల్లో సహకరించండిఃచ మధుయాష్కి గౌడ్‌ను ఆహ్వానించిన కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని మధుయాష్కి గౌడ్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నియమితులైన సర్వోత్తమ్ రెడ్డికి మధుయాష్కి గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల సన్నద్ధతపై సర్వోత్తమ్ రెడ్డి వివరించారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పూర్తి సహకారం అందించాలని, తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని మధుయాష్కి గౌడ్‌ను కోరారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు పట్టభద్రులు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న విషయంపై ఇరువురు నేతలు చర్చించారు. ఎల్బీనగర్ పరిధిలోని పట్టభద్రుల ఓటర్ల నమోదుతో పాటు ఎన్నికల కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. అలాగే వనస్థలిపురంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు వినియోగించుకోవచ్చని సూచించారు.
ఎ.రవీందర్‌, హైడరాబాద్‌.