మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శివలింగాల శ్రీనివాస్ గౌడ్ నియామకం..
కీసర, మేజర్ న్యూస్:కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే లక్ష్యంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శిగా చీర్యాల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు శివలింగాల శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.
పార్టీ అభివృద్ధికి శ్రమించాలి: తోటకూర వజ్రేష్ యాదవ్
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ,.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నూతన ప్రధాన కార్యదర్శి కృషి చేయాలని సూచించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ల నాయకత్వంలో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శ్రమించాలని ఆకాంక్షించారు.
కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు: శ్రీనివాస్ గౌడ్
తన నియామకం పట్ల శివలింగాల శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ సంస్థాగత అభివృద్ధికి, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, జిల్లా అధ్యక్షుడికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.