వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు తెగుళ్లు - ఏ డి ఏ అపర్ణ
సూర్య- బిక్కనూర్ : వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు తెగుళ్లు వచ్చాయని, ఏ డి ఏ అపర్ణ చెప్పారు. శనివారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి చెందిన వరి పంటను పరిశీలించి, వరి పంటలో ప్రస్తుతం కంకి నల్లి ఉదృతి వ్యాధి సోకినట్లు గుర్తించారు. వ్యాధి నివారణకు స్పైరోమెసిఫైన్ మందును నీటిలో కలుపుకొని పిచికారి చేయాలని సూచించారు. ఒక వేల దోమ ఉదృతి ఉన్నట్లయితే పంటలను ఆరబెట్టాలని వివరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు ఉన్నారు