సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి - అదనపు కలెక్టర్ వై వి గిరి
సూర్య- బిక్కనూర్ : సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా అదనపు కలెక్టర్ వై వి గిరి సూచించారు. శనివారం మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ ఆవరణలో శనిగ విత్తనాల కొనుగోళ్ళను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలీనో ప్రభావం దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఏ డి ఏ అపర్ణ, సంఘ అధ్యక్షులు బాలగౌని రాజాగౌడ్, గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి, సొసైటీ సీఈఓ మోహన్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి పాత లక్ష్మి, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.