ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆశ్వీయుజ పౌర్ణమి పూజలు
విశాఖపట్నం, సూర్య : ఇసుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సోమవారం ఆశ్వీయుజ పౌర్ణమి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్లు ఈవో టి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ధ్వజస్తంభం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ పూజ కోసం భక్తులు రూ. 1116 రుసుముగా చెల్లించి పూజలో పాల్గొనవచ్చును అన్నారు అదే రోజు దేవస్థానంలో ప్రత్యేకంగా సత్య నారాయణ స్వామి వ్రతాలు ఉదయం ఏడు గంటల కు, 10:30 నిమిషములకు ఆలయంలో భక్తుల కోసం చేస్తున్నట్లు వెల్లడించారు ఈ వ్రతాల్లో పాల్గొనదలచిన భక్తులు రూ. 1116, చెల్లించి పాల్గొన్న వచ్చునని వెల్లడించారు. అదే రోజు తెల్ల ఉదయం 8 -30 నిమిషములకు వ్రత పూజలు పాల్గొన్నారు.రూ. 516 లు చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. ఆశ్వీయుధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తెల్లవారు 4 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు దర్శించే అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత అన్న విద్ధరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. కార్లు టూ వీలర్స్ పై వచ్చావు వాహనదారులు పూర్ణ మార్కెట్ వెనకవైపు నుంచి ఏర్పాటు చేసిన కొండపైకి రహదారిపై నుండి ఆలయ వద్దకు రావాల్సి ఉంటుందని పార్కింగ్ చేసుకొని ఆలయంలో ప్రవేశించవలసిoది గా సూచించారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.