మహబూబాషా ఆషూర్‌ఖానాకు మహర్దశ.. నూతన స్లాబ్ నిర్మాణానికి శ్రీకారం
ఝరాసంగం;జిర్లపల్లి గ్రామంలోని మహబూబాషా దర్గా వద్ద ఉన్న పాత పీర్ల ఆషూర్‌ఖానాకు మహర్దశ పట్టనుంది. మైనారిటీ వర్గాల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తిస్తూ, ఆరాధనా ప్రాంగణంలో మౌలిక వసతుల మెరుగుదలకు గ్రామ సర్పంచ్ బొబ్బిలిగామ అమరేశ్వరి శివమణి ప్రత్యేక చొరవ చూపారు. ఇందులో భాగంగా ఆషూర్‌ఖానాకు నూతన స్లాబ్ నిర్మాణ పనులను ప్రత్యేక పూజల అనంతరం లాంఛనంగా ప్రారంభించారు.ప్రతి సంవత్సరం పీర్ల పండుగతో పాటు ఇతర మతపరమైన కార్యక్రమాల సందర్భంగా జియారత్‌దారులు, గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు దర్గాను సందర్శించే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం, మతపరమైన ప్రాంగణాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే పీర్ల పండుగ, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో జియారత్‌దారులకు మరింత అనుకూలమైన వాతావరణం అందుబాటులోకి రానుంది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, సంగమేశ్వర్ పాటిల్, గ్రామ పెద్దలు రవీందర్ రెడ్డి, మొల్ల ఉస్మాన్, నిజాం, మహమ్మద్ అనీఫ్, చి. రాజు, కిష్టయ్య, సంజీవులు, బి. బిచ్చయ్య తదితరులతో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. ఆషూర్‌ఖానా అభివృద్ధికి చొరవ చూపిన సర్పంచ్‌తో పాటు నిర్మాణ పనులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.