BREAKING
సబ్‌టైటలింగ్ అనేది కేవలం అనువాదం కాదు, ఒక కళ బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ! గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ.. మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ఘనత గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!! మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ! రామాయణం చిత్ర బృందంతో అమిత్ షా భేటీ సత్యభామ కోణంలో శ్రీకృష్ణుడి జీవన గాథ కుందారపు రామారావు - పద్మావతి దంపతులు కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఇఫ్ఫీ 2026లో టాగో వరల్డ్ ప్రీమియర్ వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రూ.71 కోట్ల పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రూ.71 కోట్ల పనులకు శంకుస్థాపన

నాగర్‌కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ (గురువారం) నాగర్‌కర్నూలు జిల్లాలోని మద్దిమడుగులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ నిర్మాణంతో పాటు మొత్తం రూ.71 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆదర్శమూర్తిగా జీవించారని కొనియాడారు. గతంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పంచిపెడుతోందని తెలిపారు. గడిచిన కాలంలో అన్ని రాజకీయ పార్టీలు లంబాడాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని విమర్శించిన సీఎం, తమ ప్రభుత్వం లంబాడా సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని స్పష్టం చేశారు.