మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆధ్వర్యంలో మహా చండీయాగం
పటాన్‌చెరు;కార్తీక మాస శనివారం సందర్భంగా పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మహా చండీయాగం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏపూరి శివానందం దంపతులతో పాటు మరో 25 మంది దంపతులు కలిపి మొత్తం 26 మంది దంపతులు ఈ మహా చండీయాగంలో పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, సింధూరార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం, మహా చండీయాగం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు పాల్గొన్నారు. యాగం అనంతరం సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏపూరి శివానందం దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.