లయన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షల నిర్వహణ.
వట్టిపల్లి;మండల కేంద్రంలో గురుకృప వైద్యశాల వద్ద ( లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి) వారి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు డాక్టర్ వైద్యసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించినారు .చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలిపినారు. ప్రతి 10 మందిలో ఒకరికి మధుమేహ వ్యాధి/ చక్కర వ్యాధి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పరీక్ష చేయించుకున్న వ్యక్తులు మాట్లాడుతూ !ఎక్కడో దూరం వెళ్లి రక్తపరీక్ష చేసుకునే పరిస్థితి తప్పిందని ,క్లబ్ వారికి ధన్యవాదములు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైద్యసాగర్ ,ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, పి గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సిద్దేశ్వర్ ,వెంకట్ పాటిల్ ,పెద్దన్న, మధు, మొదలగు వారు పాల్గొన్నారు.