BREAKING
21వ వార్డులో జనజాతరను తలపించిన కూటమి ప్రచారం : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాగూర్ వలికి ప్రజాదరణ మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా : ప్రచారంలో వైఎస్ఆర్సిపి అతిరథ మహారధుల ధీమా మహిళా సర్పంచుల శిక్షణతో గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలు 30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్:

దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న…

Select Suryaa Now
దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!…  ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా..  యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి…  సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు..  కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న…

 

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి:

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాజకీయ కుయుక్తులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న అన్నారు. పదేళ్ల పాలనలో యువతకు జరిగిన అన్యాయాలకు కేటీఆర్‌ ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పేపర్‌ లీకేజీలు, 317 జీవో వంటి అంశాలపై యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. “కేటీఆర్‌.. ముందు గతాన్ని గుర్తు చేసుకో. ఆ తర్వాతే ప్రభుత్వాన్ని ప్రశ్నించు” అని నరసన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ శ్రేణులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ఉద్యోగుల సమస్యలపైనా చర్చ జరుగుతుందని తెలిపారు.“ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. అక్కడే ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చిస్తుందని అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన యువ సమరభేరికి యువత నుంచి ఆశించిన స్పందన కనిపించలేదని అన్నారు.
బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలు వరుసగా అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్నాయని, ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు యువతను పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం రాజకీయ నాటకమేనని విమర్శించారు.“నాడు చేసిన మోసానికి ముందు యువతకు క్షమాపణ చెప్పాలి.. ఆ తర్వాతే నీతులు చెప్పాలి” అని నరసన్న అన్నారు. కేటీఆర్‌ ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ ప్రజలు, యువత వాటిని పట్టించుకోరని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న స్పష్టం చేశారు.