BREAKING
సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

కొల్చారం బీసీ హాస్టల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
కొల్చారం బీసీ హాస్టల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

కొల్చారం;భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిల్లలంటే ఎంతో ఇష్టపడే నెహ్రూను చిన్నారులు ప్రేమగా 'చాచా నెహ్రూ' అని పిలుచుకునేవారు. ఈ సందర్భంగా నాయకులు, రాజకీయ ప్రముఖులు చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి బాలలే రేపటి పౌరులని గుర్తుచేశారు.మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులకు అరటిపండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోరపల్లి రాణి గోపి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు వనమాల రాణి, శ్రీధర్, నేరెళ్ల సత్యనారాయణ, కారోబార్ వడ్ల ప్రభాకర్, సురేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.