BREAKING
ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

కంసన్‌పల్లి (బి) అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు

Select Suryaa Now
కంసన్‌పల్లి (బి) అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు

బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండలం కంసన్‌పల్లి (బి) గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే మూడు కీలక భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించారు.ఈ మేరకు శనివారం గ్రామ సర్పంచ్ గొల్ల సంగీత శాంతు గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను, ప్రజల అవసరాలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయనకు వివరించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.మంజూరైన నిధుల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు, మహిళా డ్వాక్రా భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆయా వర్గాలకు ఉపయోగకరమైన భవనాలు అందుబాటులోకి రానున్నాయి.గ్రామ అభివృద్ధికి ఒకేసారి రూ.50 లక్షల నిధులు మంజూరు కావడంతో కంసన్‌పల్లి (బి) గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అవసరాలను గుర్తించి నిధుల కేటాయింపునకు చొరవ చూపిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి సర్పంచ్ గొల్ల సంగీత శాంతు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, ప్రేమ్ సింగ్, ఖలీల్, శాంతు యాదవ్, నరేష్, లక్ష్మణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.