కందుకూరులో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అయిందా
కందుకూరులో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
కందుకూరు : మండలంలోని కందుకూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆటలు, పాటలతో సందడిగా గడిపారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి గంగవడిలో నిమజ్జనం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్