కనీస వసతులు లేక ఎల్లుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల ఇబ్బందులు
టెేక్మల్;మండల పరిధిలోని ఎల్లుపేట గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వైద్య సేవల కోసం వచ్చే రోగులకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని తెలుస్తోంది.కనీసం రక్తపోటు (బీపీ) పరీక్ష చేసేందుకు బీపీ మిషన్ కూడా లేదని సిబ్బంది తెలిపినట్లు సమాచారం.దీంతో బీపీ పరీక్షల కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా, కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.అవసరమైన వైద్య పరికరాలు, కనీస వసతులు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.