కడవెరుగు ప్రైమరీ స్కూల్లో నూతన బోరు మోటార్ ఫిట్టింగ్ .
కడవెరుగు ప్రైమరీ స్కూల్లో నూతన బోరు మోటార్ ఫిట్టింగ్ .
చేర్యాల మేజర్ న్యూస్ ….
చేరియాల మండలం కడవెరుగు గ్రామ ప్రైమరీ స్కూల్ ఆవరణలో విద్యార్థుల తాగునీటి అవసరాల దృష్ట్యా గ్రామపంచాయతీ నిధుల నుండి నూతన బోరు మోటార్ పంపు ఫిట్టింగ్ చేశారు .గత కొద్ది రోజులుగా పాఠశాల బోరు మోటార్ పాడవడంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని హెడ్మాస్టర్ దృష్టికి తేవడంతో గ్రామ పంచాయతీ సత్వరమే స్పందించింది. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.నూతన మోటార్ ఏర్పాటుతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ పంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా ఉప సర్పంచ్ జంగ సురేందర్ కార్యదర్శి - రాజు ,ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ బుచ్చయ్య ,ఉపాధ్యాయులు ప్రశాంత్ ,కారోబార్ బిక్షపతి ,తదితరులు పాల్గొన్నారు