కార్యకర్తలకు అండగా ఎర్రబెల్లి దయాకర్ రావు
దేవరుప్పుల, మేజర్ న్యూస్ , పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మానవీయతను చాటుకున్నారు. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో పర్యటించిన ఆయన అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ శ్రేణులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి తండ్రి మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఏళ్లబోయిన మహేష్ గత కొన్ని రోజుల క్రితం పాము కాటుకు గురికావడంతో ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, ప్రమాదంలో కాలు విరిగి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న యువజన నాయకుడు చింత ప్రణీత్‌ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మనోధైర్యాన్ని నింపారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింత కొండయ్య తండ్రి చింత సోమయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శలు బాధిత కుటుంబాలకు, కార్యకర్తలకు ధైర్యాన్ని అందించాయి. ఈ పర్యటనలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి, వీరారెడ్డి, దామోదర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్పంచ్ చింత రవి, వార్డు సభ్యుడు చింత లక్ష్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏళ్లబోయిన గిరి యాదవ్, కార్యదర్శి తాళ్లపెల్లి మహేష్, సీనియర్ నాయకులు బిల్లా యాదవ రెడ్డి, మోలుగూరి సోమనర్సయ్య, మరాఠీ కొండయ్య, చింత శ్రీను, ఇదునూరి శేఖర్ రెడ్డి, మహమ్మద్ పాషా, చింత పరశురాములు, గుండె రమేష్, చింత శేఖర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; ఎల్లేష్, దేవరుప్పుల, జనగామ జిల్లా