BREAKING
ఓటీటీలోకి అంచనాలు పెంచుతున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ ఇంటింటా ప్రచారం ఆలమూరు మండలంలో జోరుగా ఎన్నికల సందడి: రెండో రోజు 48 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు! ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల మాయలో పడిపోతున్నామా.. కొనుగోలుకు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ. ముక్కామల కూటమి ఎంపీటీసీ నామినేషన్లకు భారీ ర్యాలీ పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై

కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి.. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

Select Suryaa Now
కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి.. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

 పటాన్ చెరు;కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అక్టోబర్ 25న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాశమైలారం పారిశ్రామికవాడలో సీఐటీయూ నాయకులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. ఈ కోడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టబద్ధమైన సౌకర్యాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో కార్మిక కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతోందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మికులు తమ కుటుంబాల కనీస అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, బోనస్‌, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొంటూ, అక్టోబర్ 25న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అతిమేల మాణిక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కిర్బీ యూనియన్ జనరల్ సెక్రటరీ వీఎస్ రాజు, యూనియన్ నాయకులు తలారి శ్రీనివాస్, నాగప్రసాద్, సుధాకర్, ఏడుకొండలు, లక్కన్, జైపాల్, రాజిరెడ్డి, ప్రవీణ్, పెద్దిరాజు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రాజు తదితరులు పాల్గొన్నారు.