BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ ఇంటింటా ప్రచారం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరానగర్ కాలనీలో చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మేక సత్యవతితో పాటు ఐదో వార్డు అభ్యర్థి పిండి రాము, ఆరో వార్డు అభ్యర్థి గుబ్బల మంగ, నాలుగో వార్డు అభ్యర్థి బండారు లక్ష్మణరావు గెలుపు కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

ఇందిరానగర్ కాలనీ, వైఎస్సార్ కాలనీ, రామా డిస్టిలరీ ప్రాంతం, జెట్టి గురునాథరావు వీధి, వంగవారి వీధి, వినాయకుడి గుడి వీధి తదితర ప్రాంతాల్లో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీవీఆర్ చౌదరి, కర్పూరం గౌరయ్య గుప్తా, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, చలమాల శ్రీనివాసరావు, ఐజీ, చింత అనిల్, పంతగాని వెంకన్న, గూడపాటి రాధాకృష్ణ, షరీఫ్, మేక సింహాద్రి, మాకనబోయిన మురళి తదితరులు పాల్గొన్నారు.