కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు సమష్టిగా పనిచేయాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ : కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు సమష్టిగా పనిచేయాలని, కాలనీల అభివృద్ధికి నూతనంగా ఏర్పాటైన సంక్షేమ సంఘాలకు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టం చేశారు. శనివారం కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో 128వ చింతల్ డివిజన్ రంగానగర్, 130వ సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలకు చెందిన నూతన సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధి విషయంలో వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా తమ, పర అనే తేడా చూపకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీలను మరింత అభివృద్ధి చేసేందుకు నూతన కార్యవర్గాలు చొరవ చూపాలని, వారి అభివృద్ధి కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి కాలనీ నూతన సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జి. అరుణారెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబు, మాజీ అధ్యక్షులు సాగర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, దేవాలయ మాజీ అధ్యక్షులు యాదగిరి యాదవ్, రంగానగర్ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి జంప శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బాల చెన్నయ్య, నర్సింహులు నల్ల, చీఫ్ అడ్వైజర్ మధుకుమార్ యాదవ్, ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి మహేష్, కోశాధికారి కృష్ణారావుతో పాటు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.