BREAKING
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

Select Suryaa Now
జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో "అసంఘటిత రంగ కార్మికుల పై రూపొందించిన స్వేచ్ఛ రథాన్ని" జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ వెట్టిచాకిరి, బానిసత్వం అనేది అనాదిగా వస్తున్న సామాజిక రుగ్మత అని అన్నారు. వెట్టి చాకిరి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే    రాష్ట్రవ్యాప్తంగా
ప్రచార రథాల ద్వారా
ప్రజలకు అవగాహన కల్పించనుందని, ఈ ప్రచార రథాలు 20 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా  బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సంతలు, గ్రామ చావడీలు , జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో  వెట్టిచాకిరి, బానిసత్వం నిర్మూలన పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వెట్టిచాకిరిని  నిర్మూలించే విషయమై  కళాకారులు పాటలు, దృశ్య రూపకాలు, కరపత్రాలు, గోడపత్రికల రూపంలో అందరికీ విస్తృతంగా తెలియజేస్తారని తెలిపారు.  జిల్లా ప్రజలు వెట్టి చాకిరి పట్ల జాగరూకులై ఉండాలని, జిల్లాలో  వెట్టి చాకిరి పేరు వినపడకుండా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెట్టిచాకిరి పై ఎవరి కైనా సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్  08069434343  కు
తెలియజేయాలన్నారు. వెట్టి చాకిరి, బానిసత్వ నిర్మూలనకు
కార్మిక, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, తదితర శాఖల సమన్వయం ముఖ్యమని,  అందరి సహకారంతో వెట్టిచాకిరి నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్  అన్నారు.స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, కార్మికశాఖ ఉప కమీషనర్ చంద్రశేఖర్ గౌడ్, సహాయ కమిషనర్లు పి .అరుణ, సయ్యద్ మొయిజుద్దీన్, జిల్లా సంక్షేమ అధికారి లావణ్య, ఏ హెచ్ టి యు అంజలి, సిడబ్ల్యుసి చైర్మన్ చింతా కృష్ణ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి గణేష్, కోఆర్డినేటర్ మహేష్, తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్టిచాకిరి నిర్మూలనపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.