BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుకు కృషి.

Select Suryaa Now
జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుకు కృషి.

జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుకు కృషి.
-ఏళ్లు గడుస్తున్నా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాల కల్పించకపోవడం సిగ్గుచేటు.
-కార్మికులకు నష్టం కలిగించే జీవో 51 రద్దుకు అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
-ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేక కోటా కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తా.
- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

​పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- గ్రామ పంచాయతీల్లో నిరంతరం సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. పాల్వంచ పట్టణంలోని సీఆర్ భవన్‌లో శుక్రవారం ఏఐటీయూసీ అనుబంధ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పాల్వంచ మండల స్థాయి మహాసభ జరిగింది. ఈ మహాసభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, అలాగే జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు నష్టం కలిగించే జీవో నంబర్ 51 (మల్టీపర్పస్ విధానం) రద్దు అంశంపై అసెంబ్లీలో గళమెత్తుతానని చెప్పారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడం, ఉద్యోగ భద్రతతో పాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ భరోసా, యూనిఫాంలు, శానిటైజర్ కిట్లు అందించేలా సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. సొంత ఇల్లు లేని అర్హులైన పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు ప్రత్యేక  కేటాయింపు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు తనవంతుగా పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, బికేయంయు జిల్లా అధ్యక్షులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఎఐటియుసి జిల్లా నాయకులు యూసుఫ్, అన్నారపు వెంకటేశ్వర్లు నిమ్మల రాంబాబు ఇట్టి వెంకట్రావు, యూనియన్ నాయకులు లంబా నాయక్, బాలకృష్ణ, శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీను, లెనిన్, మమత, వినయ్, రామనాధం, రవి, దుర్గా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.