జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు
జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు
పాలకవీడు మేజర్ న్యూస్
పాలకవీడు మండలంలోని ప్రసిద్ధ జాన్‌పహాడ్ దర్గాలో జనసేన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి హుజూర్‌నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, యువత మరియు పట్టభద్రుల సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు
అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
అనంతరం గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనం ద్వారా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియ గురించి వివరించి, నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా సరికొప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ, యువతకు మరియు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, సరికొప్పుల నాగేశ్వర రావు, నాయిని మధు, శ్రీనివాస్ రెడ్డి, షేక్ రషీద్, నాగ చారి, నవీన్ కార్యకర్తలు పాల్గొన్నారు.