BREAKING
రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. శివకేశవుల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి అండర్-19 ఆసియా కప్: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ సంచలన విజయం హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్: ముంబైని వీడాలని లేదన్న స్టార్ ఆల్‌రౌండర్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఇంకొల్లు ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు సమిష్టి కృషితోనే వైఎస్సార్‌సీపీ విజయం * ఎమ్మెల్సీ సురేష్ బాబు * వెస్టిండీస్ స్పిన్నర్ అరుదైన ఫీట్: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ బుసాయవలస. జడ్పీహెచ్ఎస్ స్కూల్అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ విరాట్ కోహ్లీతో చర్చ ప్రమాదకరమే: మాజీ కోచ్ డ్వాసెట్ ఆసక్తికర వ్యాఖ్యలు చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డు: అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చరిత్ర సృష్టించిన జింబాబ్వే వెటరన్ క్రెయిగ్ ఎర్విన్ బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలి విద్యార్థులకు న్యాయవ్యవస్థపై అవగాహన అవసరం: జడ్జి హిమబిందు

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్
సూర్య, పెంచికల్‌పేట్: మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రమేష్–స్వరూప దంపతుల నూతన గృహంలో జరిగిన ఈ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నూతన గృహంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, రమేష్–స్వరూప దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామస్తులు, స్థానిక నాయకులు శాలువాతో ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దండే విఠల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నూతన గృహంలో అడుగుపెట్టిన రమేష్–స్వరూప దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
- సీఎం జన్మదిన వేడుకలు : అనంతరం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెంచికల్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సముద్రాల రాజన్న, ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, ఎల్కపల్లి సర్పంచ్ రాంచందర్, పెంచికల్‌పేట్ సర్పంచ్ షేక్ ఉస్మాన్, గ్రామ కార్యదర్శి, మండల నాయకులు రాచకొండ కృష్ణ, రమేష్, చంద్రమౌళి, సంతోష్, రాజన్న, అత్తహ బెగి, కొల్లిపాక శ్రీను, బాబాజీతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.