మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగర నూతన మేయర్ చిట్లూరు రమేష్‌ను సోమవారం జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్‌కు ఘనంగా సన్మానం చేసి, పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ అనంతపురం నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా, ప్రశాంత వాతావరణం కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు మేయర్ చిట్లూరు రమేష్ కృషి చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు.
అనంతరం ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్డీ రహిత బ్యాంకింగ్ విధానానికి సంబంధించిన పోస్టర్‌ను మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమాజంలో ఆర్థిక అవగాహన, సేవాభావం పెంపొందించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర విస్తరణ కార్యదర్శి యాసిర్ అహ్మద్, నగర ప్రధాన కార్యదర్శి హాజీ పీరా, ఐవైఎం రాష్ట్ర కార్యదర్శి హబీబ్, ఎస్ఐఓ నగర కార్యదర్శి నిజాం, సీఐఓ నగర ఇన్‌చార్జ్ జీలానీ, ఖిద్మత్ సొసైటీ డైరెక్టర్ జమీర్ అహ్మద్, సభ్యులు సిరాజ్ అహ్మద్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్‌కు అనుబంధంగా ఉన్న స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్, సీఐఓ ప్రతినిధులు, ఖిద్మత్ సొసైటీ సభ్యులు పాల్గొని నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్