మంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాం … కానీ ....
హామీలు కాదు , జీవో రద్దు పై అధికారిక ప్రకటన రావాలి…
జీవో 641 రద్దయ్యే వరకు ప్రజా ఉద్యమం సాగుతుంది….
*సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ( SDVP JAC )….
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గత రెండ rరోజుల క్రితం రాష్ట్ర రెవిన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ సమస్యపై మాట్లాడడం పట్ల డంపింగ్ యార్డ్ పోరాట సమితి జేఏసీ నాయకులు స్వాగతిస్తున్నట్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలిపారు.. సిద్దాపూర్ లో డంపింగ్ యార్డు రాదు , రానివ్వను అని ప్రకటన చేయడం అభినందించదగ్గ విషయం అని, జేఏసి గా స్వాగతిస్తున్నామని ఎన్ని రోజుల్లో అధికారికంగా జీవో రద్దు చేస్తారో తెలుపాలని సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (SDVP JAC) చైర్మన్ రాంబల్ నాయక్, కన్వీనర్ పినపాక ప్రభాకర్, కో ఆర్డినేటర్ తిరుమలయ్య లు తెలిపారు. ప్రకటనను సాగతిస్తున్నాం కానీ కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా జీవో రద్దు కొరకు అధికారిక ప్రకటన చేయాలి అని కోరారు. ఈ ఉద్యమమని ప్రభుత్వం అధికారికంగా ఈ జీవో 641 నీ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దని ప్రజా ఉద్యమానికే ఈ రోజు మంత్రి ప్రకటన అనే విషయం మరువ వద్దని, అదే ప్రజా ఉద్యమనే లేకపోతే జీవో తెచ్చిన వాళ్లే ఎందుకు రాదు అంటారో ఆలోచన చేయాలని అన్నారు... ప్రజా ఉద్యమాల ద్వారానే విజయాలు సాధిస్తాం అన్నారు. ఇది ప్రజా ఉద్యమం సాధించిన ఒక నైతిక విజయమే అని, కేవలం హామీలకు సంబరపడి ఉద్యమాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. హామీలు కేవలం ఉపశమనం మాత్రమేనని, గతంలో కూడా స్థానిక సాధన సభ్యులు నేను దంపు యార్డు రానివ్వను అని చెప్పిన రెండ్రోజులకే అధికారికంగా జీవో వచ్చిన విషయం మర్చిపోరాదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం లో లక్ష్మి దేవి పల్లి రిజర్వాయర్ విషయంలో ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్న సమయంలో ఆనాడు గద్దర్ సమక్షంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మా ప్రభుత్వం రాగానే వెంటనే ప్రాజెక్ట్ మొదలు పెడతాం అని హామీ ఇచ్చారు. కానీ మూడు సంవత్సరాలుగా తట్టెడు మట్టి ఎత్తారా ఆలోచన చేయాలి అన్నారు. ఇలా రోజుకొక మాట చెప్తే నమ్మే రోజులు పోయాయని, జీవో పై అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా ప్రజలపై అంత ప్రేమ ఉంటే స్తానిక శాసన సభ్యులు దీక్ష శిబిరం వద్దకు వచ్చి నేను డంపింగ్ యార్డు జీవో ను ఒక నెలలో లేదా రెండు నెలల్లో రద్దు చేయిస్తా అని సరైన హామీ ఇస్తే జేఏసి గా చర్చించి ఈ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలా కాకుండా రానియ్యం , రాదు అంటే ఇది రాజకీయ క్రీడే అవుతుంది , ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయడమే అవుతుంది , దానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (SDVP JAC) సలహా దారులు అబ్దుల్ రబ్ జామి, చైర్మన్ రాంబల్ నాయక్, కన్వీనర్ పినపాక ప్రభాకర్, కో ఆర్డినేటర్ తిరుమలయ్య, కో కన్వీనర్ లు అర్జునప్ప , రవీంద్రనాథ్, నాయకులు రాజేందర్ రెడ్డి, శ్రీధరా చారి, తదితరులు పాల్గొన్నారు..
నరసింహ రెడ్డి మేజర్ న్యూస్….