సమిష్టి కృషితోనే వైఎస్సార్‌సీపీ విజయం * ఎమ్మెల్సీ సురేష్ బాబు *
నెల్లిమర్ల, సూర్య : నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో వైఎస్ ఆర్ సిపి అభ్యర్థులు విజయం సాధించారని, ఎమ్మెల్సీ సురేష్ బాబు అన్నారు. మండలంలోని మొయిదలోని ఎమ్మెల్సీ స్వగృహంలో నెల్లిమర్ల జెడ్పీటీసీగా ఎన్నికైన మత్స విజయ భర్త మత్స సత్యనారాయణ, మొయిద ఎంపీటీసీగా ఎన్నికైన మొయిద కళావతిలు ఎమ్మెల్సీని కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, కొందరు నాయకులు పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని ఈ ఎన్నికలే నిరూపించాయని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మణరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగా శ్రీను, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్ఞులు పతివాడ సత్యనారాయణ పాల్గొన్నారు.