BREAKING
ఎన్విడియా సంక్షోభం...చైనా టెక్ రంగానికి లాభం కంటే నష్టమే ఎక్కువ మానవత్వం సాటుకున్న శ్రీకాళహస్తి కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి వర్షార్భణంగా భారత్ - న్యూజిలాండ్ 'ఎ' మూడో అనధికారిక టెస్ట్ మూడో రోజు ఆట తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు: సర్వదర్శనానికి 15 గంటల సమయం కెనడాలో భారీ విలీనం...గ్రీన్‌ఫైర్ సంస్థను సొంతం చేసుకోనున్న స్ట్రాత్‌కోనా హాసాకొత్తూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్ మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సిరీస్ కైవసంపై కన్నేసిన టీమిండియా, రోహిత్ శర్మపైనే అందరి దృష్టి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవ కార్యక్రమాలు దీపావళి తర్వాత..ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదు ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం...ఏడుగురు మృతి, వందకు పైగా గాయాలు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ సెక్యూరోనామిక్స్ ముప్పు..వృద్ధి మందగమనాన్ని నివారించడం ఎలా? ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పి సంజీవరెడ్డి

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పి సంజీవరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా ఆదివారం శంకరంపేట్ మండలం రామోజీపల్లి గ్రామంలోని దంతెల రాధిక భర్త శ్రీ భాస్కర్ ఇంట్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, వారి కొత్త ఇంటిలో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.... ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని, ప్రభుత్వం ప్రజల జీవితాల్లో స్పర్శించే సేవా కార్యక్రమాలను అందిస్తున్నదని అన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే తగినంతగా పరిష్కరించడానికి తాను సంసిద్ధుడినని కూడా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి, వారితో కలిసి పండుగను జరుపుకునేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సంతోషంలో పాలుపంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.