భారీగా పెరిగిన పసిడి ధరలు
హైదరాబాద్ :వినియోగదారులకు బంగారం షాకిచ్చింది. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధరపై ఏకంగా రూ.1,030 పెరగడంతో దాని ధర రూ.1,44,600కి చేరింది.
అటు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.950 పెరిగి రూ.1,32,550కి ఎగబాకింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.05 లక్షల వద్ద నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలే ధరల పెరుగుదలకు కారణమని పసిడి వ్యాపారులు వెల్లడిస్తున్నారు.