హైదరాబాద్‌లో టపాసులు కాల్చుతూ పలువురికి కంటి గాయాలు
హైదరాబాద్ :హైదరాబాద్‌లో దీపావళి పండుగ వేడుకల్లో చిన్నపాటి అపశృతి చోటుచేసుకుంది. బాణసంచా కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తు పలువురు కంటి గాయాల పాలయ్యారు. బాధితులు చికిత్స కోసం మెహదీపట్నంలోని ప్రముఖ సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇప్పటివరకు నమోదైన వివరాల ప్రకారం మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రికి రాగా, వారిలో ఐదుగురి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. మిగతా 10 మందికి అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి అవుట్‌పేషెంట్ (ఓపీ) విభాగం ద్వారా ఇంటికి పంపించారు.
ఆసుపత్రిలో చేరిన ఐదుగురిలో నలుగురు చిన్నారులు, ఒకరు పెద్దవారు ఉన్నారు. అయితే బాధితులెవరికీ చూపు కోల్పోయేంత తీవ్రమైన గాయాలు కాలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు వెల్లడించడంతో బాధితుల కుటుంబసభ్యులు ఉపశమనం పొందారు. పండుగ రోజున మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అత్యవసర ಪರಿಸ్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.