BREAKING
దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో సేవా సందడి.. --రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ దంపతులు --కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు

దీపావళి తర్వాత..ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదు

Select Suryaa Now
దీపావళి తర్వాత..ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదు

న్యూఢిల్లీ :దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీపావళి పండుగ వేడుకల అనంతరం ఎయిర్ పొల్యూషన్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. పండుగ రాత్రి బాణసంచా విచ్చలవిడిగా కాల్చడంతో అర్ధరాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గరిష్టంగా 1760 స్థాయికి చేరిందని, ఇది అత్యంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల సమయానికి కాలుష్య తీవ్రత కొంత తగ్గి 1326కి చేరుకోగా, ప్రస్తుతం ఢిల్లీ సగటు AQI 373గా నమోదైంది.

ప్రాంతాల వారీగా పరిశీలిస్తే సోనియా విహార్‌లో అత్యధికంగా 463 AQI నమోదు కాగా, బురారీ క్రాసింగ్‌లో 452, జహంగీర్‌పురిలో 447గా తీవ్రమైన స్థాయిలో ఉంది. గాలుల వేగం బాగా తగ్గడంతో గాలిలోని విషపూరిత ధూళి కణాలు ఒకే చోట పేరుకుపోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. కాలుష్యాన్ని అదుపు చేసేందుకు రాజధానిలో 'గ్రాప్-3' (GRAP-3) ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాణ పనులు, పాత వాహనాల రాకపోకలపై తీవ్ర నిబంధనలు విధించారు.