BREAKING
చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద అగ్నిప్రమాదం: దగ్ధమైన పాత రికార్డులు అభివ్రుద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాం...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి శ్రీ మఠంలో దీపావళి వేడుకలు దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం:ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం

Select Suryaa Now
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం:ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సివ్నీ జిల్లా ఛపారా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు బయటకు తప్పించుకునే వీలులేక మంటల్లో చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిలో 14 ఏళ్ల బాలిక, ఆరేళ్ల చిన్నారి, రెండు నెలల పసికందు కూడా ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.