వ్యాపారులను, ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
• దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు
సూర్య, లక్షెట్టిపేట : దీపావళి పండుగను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలను సందర్శించి వ్యాపారులను, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, కౌన్సిలర్లు మైలారం సుధాకర్, పెట్టం తిరుపతి, ఎగ్గడి జమున కుమార్, నూనె ప్రవీణ్, షేక్ చాంద్, పురుషోత్తం, సంఘ లచ్చన్న, ధనిశెట్టి మల్లేష్, శంకర్రావు, మెట్టు రాజు, మర్రిశెట్టి సుమన్, ఓరగంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.