BREAKING
చైనా సదస్సులో జిన్‌పింగ్, పుతిన్‌లతో ఇరాన్ యుద్ధంపై చర్చిస్తా: డొనాల్డ్ ట్రంప్ చైనా గూఢచర్య ఆరోపణల మహిళతో సంబంధం: ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ అంగీకారం సీమెన్స్ ఇండియా క్యూ2 సమీక్ష: ఆర్డర్ బుక్ జోరు, మార్జిన్ల తగ్గుదలపై బ్రోకరేజ్ల చూపు నేడు ప్రారంభ కానున్న ఎస్ ఏ వన్ పరీక్ష మండల ప్రకాష్ శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులు సత్తుపల్లి ఏరియా జి.ఎం వెంకటాచారి కి కృతజ్ఞతలు.**ఐఎన్టీయూసీ నేత తీగల క్రాంతి కుమార్* వ్యాపారులను, ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు *ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సందడి.. లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్న డిప్యూటీ సీఎం!* సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా పిన్నంచర్ల గ్రామ అధ్యక్షుడిగా కుమ్మరి తిరుపతన్న దేశీయ మార్కెట్లకు నిలకడైన ఆరంభ సంకేతాలు: ముహూరత్ ట్రేడింగ్ స్థాయిలే ఆధారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కీలక నిర్ణయం: వడ్డీ రేటు 4 శాతానికి పెంపు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ఉత్సవాలు జపాన్ స్టాక్ మార్కెట్లో ర్యాలీ: 1.7 శాతం పెరిగిన నిక్కీ సూచీ ముహూరత్ ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాలు: సెన్సెక్స్, నిఫ్టీ ముగింపు ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా

Select Suryaa Now
సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా

దుద్యాల, మేజర్ న్యూస్:నెేడు సీఎం రేవంత్ రెడ్డి బొంరాస్‌పేట్ మండలం తుంకిమెట్ల నుంచి దుద్యాల మండలం హకీంపేట్ వెళ్లే మార్గంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూచించారు.సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో తుంకిమెట్ల–హకీంపేట్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది.

ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు: కోస్గి నుంచి పరిగి వెళ్లే వాహనదారులు కొడంగల్ మీదుగా పరిగికి చేరుకోవాలి. అదేవిధంగా పరిగి నుంచి కోస్గి వెళ్లే వాహనదారులు కూడా కొడంగల్ మీదుగానే ప్రయాణించాలని ఎస్పీ సూచించారు.వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకొని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు పాటించాలని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా విజ్ఞప్తి చేశారు.