BREAKING
మేళ్లకుంట లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి.. ఒకరికి గాయాలు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నామినేషన్ల చివరి తేదీ వరకు అవకాశం- మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పిలుపు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు నేటి పంచాంగం: 9 నవంబర్, 2026 సోమవారం ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. నేటి రాశి ఫలాలు 9 నవంబర్, 2026 కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నామినేషన్ల చివరి తేదీ వరకు అవకాశం- మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పిలుపు

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నామినేషన్ల చివరి తేదీ వరకు అవకాశం- మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు:  డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పిలుపు

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన పట్టభద్రులు ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ వరకు ఫారం-18 సమర్పించుకునే అవకాశం ఉందని *పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ సర్జన్ డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* తెలిపారు.

 ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఆయా కార్యాలయాలను సంప్రదించి ఫారం-18 సమర్పణకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు క్రియాశీలక భాగస్వామ్యం వహించడం ద్వారా విద్య, ఉపాధి, నిరుద్యోగం, సామాజిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంటుందని వివరించారు.

కావున ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులందరూ చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఫారం-18 సమర్పించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.